సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు రఘు కుంచె టైటిల్‌రోల్ పోషించిన చిత్రం ‘గేదెల రాజు కాకినాడ తాలూకా’. రవి ఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాస్, మౌనిక కీలక పాత్రధారులు. చైతన్య మోటూరి దర్శకుడు. వాణి రవికుమార్ మోటూరి నిర్మాత. రఘు కుంచె సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మంచి కంటెంట్‌తో రూపొందిన చిత్రమిదని రఘు కుంచె అన్నారు. ‘ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు..’ అనే ఈ సినిమా ఉపశీర్షికలోనే కథ అంతా దాగుంది. ఒక మర్డర్ మిస్టరీని, ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని రెండు గంట ఒక్క నిమిషం నిడివిలో క్రిస్ప్‌గా తెరకెక్కిచాం’ అని దర్శకుడు చైతన్య మోటూరి చెప్పారు.