Garudan Movie | మాస్ అవతార్‌లో తమిళ హీరో సూరి.. ఇంట్రెస్టింగ్గా ‘గరుడన్’ ట్రైలర్
Actor Soori | గతేడాది వచ్చిన విడుతలై పార్ట్-1 (Viduthalai Part 1) సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించాడు తమిళ స్టార్ కమెడియన్ సూరి (Comedian Soori). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaran) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సూరి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి.
Actor Soori | గతేడాది వచ్చిన విడుతలై పార్ట్-1 (Viduthalai Part 1) సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించాడు తమిళ స్టార్ కమెడియన్ సూరి (Comedian Soori). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaran) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సూరి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. కాగా ఈ మూవీ తర్వాత సూరి వరుస మూవీలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే విడుతలై పార్ట్-2 (Viduthalai Part 2) లో నటిస్తున్న సూరి తాజాగా మరో కొత్త సినిమాను విడుదలకు రెడీ చేశాడు.
సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గరుడన్ (Garudan). ఈ సినిమాకు కాకీ సట్టై (Kaakisattai), కోడి (Kodi), పట్టాస్ (Pattas) చిత్రాల ఫేమ్ దురై సెంథిల్‌కుమార్ (Durai Senthil Kumar) దర్శకత్వం వహిస్తుండగా.. తమిళ నటుడు శశికుమార్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రేవతి శర్మ (Revathi Sharma), శివత నాయర్ (Shivatha Nayar), బ్రిగుడ సాగ (Paavi Teacher) కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. సూరి కూడా ఇప్పటివరకు ఎన్నడూ చూడని మాస్ అవతర్ లో కనిపిస్తున్నాడు.ఇక ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ (Lark Studios), గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ(Gross Route film Company) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సముద్రఖని, మొట్టై రాజేంద్రన్, మైమ్ గోపి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ చేయనుండగా.. ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ నిర్వహించనున్నారు. కాగా ఈ చిత్రానికి వెట్రి మారన్ కథను (Vetrimaran Story) అందిస్తుండగా.. యువన్ శంకర్ రాజా (Yuvan Musical) సంగీతం అందించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

