గణేష్ బెల్లంకొండ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘స్వాతి ముత్యం’. వర్ష బొల్లమ్మ నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కావాల్సిఉంది.
అనివార్య కారణాల వల్ల చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. నిర్మాత నాగవంశీ స్పందిస్తూ…‘ముందుగా అనుకున్న తేదీన సినిమా విడుదల కోసం పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు జరుపుకున్నాం. పరిశ్రమలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. థియేటర్లకు గతంలోలాగ ప్రేక్షకులు రావడం లేదు. మాకిది సరైన సమయమే అయినా మిగతా చిత్రాలకు ఇబ్బంది కలిగించకూడదని విడుదల వాయిదా వేస్తున్నాం. ఇది మాకు ఇబ్బంది కలిగించినా తప్పడం లేదు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం’ అన్నారు.