గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రవి కస్తూరి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రేషేడ్లో ఉంటాయి. చనిపోదామనుకున్న ఓ వ్యక్తి రియల్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? అందులోని టాస్క్‌ను ఎలా పూర్తి చేశాడు? అనే అంశాలతో యాక్షన్, రొమాన్స్ ప్రధానంగా నడుస్తుంది’ అని తెలిపారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: అభిషేక్ ఏ ఆర్, నిర్మాత: రవి కస్తూరి, కథ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: దయానంద్.