Michael Patrick | హాలీవుడ్లో విషాదం.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటుడు మైఖేల్ పాట్రిక్ కన్నుమూత!
GOT Actor | హలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones) నటుడు మైఖేల్ పాట్రిక్ (Michael Patrick) కన్నుమూశారు.
GOT Actor | హలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones) నటుడు మైఖేల్ పాట్రిక్ (Michael Patrick) కన్నుమూశారు. గత కొంతకాలంగా మోటార్ న్యూరాన్ వ్యాధితో (Motor Neurone Disease) బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో 35 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచారు. ఐరిష్ నటుడైన మైఖేల్ పాట్రిక్, ఉత్తర ఐర్లాండ్‌లోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూసినట్లు ఆయన భార్య నవోమి షీహన్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది.
మైఖేల్ 2023 ఫిబ్రవరిలో ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు. మోటార్ న్యూరాన్ అనేది శరీరంలోని కండరాలు, మాట, శ్వాస వంటి కీలక వ్యవస్థలపై ప్రభావం చూపే తీవ్రమైన అనారోగ్య సమస్య. పది రోజుల క్రితమే ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించగా, కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మధ్య ఆయన ప్రశాంతంగా ప్రాణాలు విడిచినట్లు నవోమి భావోద్వేగంతో సోషల్ మీడియా వేదికగా రాసుకోచ్చింది.
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఆరో సీజన్‌లోని ‘ది బ్రోకెన్ మ్యాన్’ ఎపిసోడ్లో వైల్డ్లింగ్ రైటర్ పాత్రలో నటించి మైఖేల్ గుర్తింపు పొందారు. ఈ సిరీస్‌తో పాటు ‘బ్లూ లైట్స్’, ‘ది స్పెక్టాక్యులర్’, ‘దిస్ టౌన్’ వంటి టెలివిజన్ షోలలోనూ, పలు షేక్స్పియర్ నాటకాల్లోనూ ఆయన నటించారు. నటుడిగానే కాకుండా తన వ్యక్తిత్వంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మైఖేల్ మృతి పట్ల హాలీవుడ్ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు మరియు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

