Game Changer| మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద పరాజయం పాలైంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్కబోర్లా పడింది. గేమ్ ఛేంజర్ సినిమా విడుదలయ్యే ముందు ఇది ఒకప్పటి ‘ఒకే ఒక్కడు’ సినిమా రేంజ్లో ఉంటుందని అన్నారు. కాని మూవీ తొలి షోనే నుండే నెగెటివ్ టాక్ దక్కిందచుకుంది.
ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు రూ.200 కోట్లు నష్టపోయారని సమాచారం. అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటని ఇటీవల ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు. దర్శకుడు శంకర్ ఈ సినిమా కోసం దాదాపు 5 గంటల నిడివి గల సన్నివేశాలను చిత్రీకరించగా, అందులో రెండున్నర గంటల సినిమా కోసం మంచి సన్నివేశాలని ఎడిటింగ్‌లో లేపేయడం వలన సినిమా ఫ్లాప్ అయిందని ఒకరు అంటారు. ఇక గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్‌కి కొత్త కారణం చెప్పాడు సంగీత దర్శకుడు థమన్. . తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘డాన్స్ ఐకాన్ 2’ లేటెస్ట్ షోలో ‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.
గేమ్ ఛేంజర్ కంటే ఈ స్టెప్స్ 1000 రెట్లు బాగున్నాయని ఇవే స్టెప్స్ సినిమాలో ఉంటే బాగుండేదని కోరుకుంటున్నాను అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు థమన్. చాలా మంది సంగీత దర్శకుడు తప్పు కూడా ఉందని అనగా, థమన్ మాత్రం కొరియోగ్రాఫర్‌ని తప్పు పడుతున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాలో అభిమానులను ఆకట్టుకునేలా హుక్ స్టెప్స్ ఏమీ లేకపోవడమే దాని ఫెయిల్యూర్ కారణమని థమన్ స్పష్టం చేశాడు. ‘గేమ్ ఛేంజర్’ మూవీలో డాన్స్ బాలేదంటూ తమన్ కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాగా, ఆయన ప్రభుదేవాని ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేశాడా అని జనాలు ముచ్చటించుకుంటున్నారు. కాగా, డ్యాన్స్ షోలో ఓ చిన్నారి ‘నానా హైరానా’ పాటకి డాన్స్ చేసింది. ఆ తర్వాత ఇంకో చిన్నారి ‘జరగండి జరగండి’ పాటకు స్టెప్పులతో దుమ్మురేపింది. ఈ క్రమంలో థమన్ అలాంటి కామెంట్స్ చేశాడు.