Gama Awards 2025 | గామా అవార్డ్స్ 2025 ఐదో ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఫిబ్రవరి 16వ తేదీన దుబాయిలోని మైత్రీ ఫార్మ్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దుబాయిలోని 500 మందికిపైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ వేడుకలో గామా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్, ప్రముఖ గాయకుడు రఘు కుంచె సమక్షంలో ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను జ్యూరీ కమిటీ అధికారికంగా ప్రకటించింది. దుబాయిలోని షార్జా ఎక్స్పో సెంటర్లో జూన్ 7వ తేదీన గామా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు కోదండరామిరెడ్డి, బి.గోపాల్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపికైన టాలీవుడ్ కళాకారులు, సినిమాలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.
ఈ సందర్భంగా గామా అవార్డుల చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్న GAMA, ఇప్పుడు 2025 జూన్ 7న జరగబోయే ఐదో ఎడిషన్‌కు సినీ పెద్దలను, కళాకారులను విశిష్ట అతిథులుగా ఆహ్వానించ దలిచారని.. UAE ని తెలుగు ప్రజలకు ప్రత్యేక వినోదాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలుగు సినీ ప్రముఖులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు . UAEలో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతితెలుగు వారికి ధన్యవాదాలు తెలిపారు.
Gama Awards1
గామా అవార్డుల సీఈవో సౌరభ్ కేసరి మాట్లాడుతూ.. GAMA అవార్డ్స్‌ను వినూత్నంగా అత్యంత వినోదభరితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి THE GAMA EXCELLENCE AWARDS ఇచ్చి సత్కరించనున్నారని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే సినీ ప్రముఖులను ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. నామినేటెడ్ అయిన విభాగాలకు, పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వారందరు ఇంత అద్బుతమైన ఇటువంటి కార్యక్రమం UAE లో జరగడం తెలుగు వారందకీ చాలా గర్వముగా ఉందని వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. అనంతరం జ్యూరీ సభ్యులుగా ఉన్న కోదండ రామిరెడ్డి, కోటి, బి. గోపాల్ ప్రత్యేకంగా పంపిన వీడియో సందేశాలు ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ GAMA గొప్పతనాన్ని, కళాకారుల ప్రతిభకు అందించే ప్రోత్సాహాన్ని గురించి ఆ వీడియో సందేశంలో వారు వెల్లడించారు.
కుంచె రఘు గారు మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తనలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ ఈ GAMA అని అన్నారు. గామాతో తమకు చాలా మంచి అనుబంధం ఉందని తెలిపారు.
వినోదాన్ని పంచిన సంగీత వేదిక
ఈ వేడుకలో యాంకర్ & సింగర్ తిరు, శరణ్య తమ చక్కటి ప్రదర్శనలతో వచ్చిన అతిధులను ఆకట్టుకున్నారు. సంగీత ప్రదర్శనలతో పాటు, ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడంతో, హాజరైన ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్‌ను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. మేజీషియన్ రవి తన వినూత్న మాయాజాలంతో GAMA అవార్ద్స్ 2025 ని రివీల్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.