Vivek Chepuri | విలన్ నుంచి హీరోగా వివేక్ చేపూరి గ్రాండ్ ఎంట్రీ!
Vivek Chepuri | ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో విలనిజంతో ప్రేక్షకులను మెప్పించిన యువ నటుడు వివేక్ చేపూరి ఇప్పుడు హీరోగా టాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారు.
Vivek Chepuri | ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో విలనిజంతో ప్రేక్షకులను మెప్పించిన యువ నటుడు వివేక్ చేపూరి ఇప్పుడు హీరోగా టాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారు. 2019లో వచ్చిన ఆ చిత్రంలో రవి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల విశ్వక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్ట్’ చిత్రంలో ఇషాన్ పాత్రతో మరోసారి అందరినీ భయపెట్టడమే కాకుండా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పాత్రకు సంబంధించిన రీల్స్ ఎంతగానో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ పీ అండ్ టీ కాలనీకి చెందిన వివేక్ చేపూరి, తొందరపడి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా ఎంతో సంయమనంతో మంచి పాత్రల కోసం వేచి చూశారు. ఈ క్రమంలోనే ఆయన త్వరలోనే హీరోగా ఓ ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు టి. శరత్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ నెలలోనే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ మరియు టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

