Dasaratha Madhav | ఏరోనాటికల్ ఇంజినీరింగ్ నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా.. ‘కిల్లర్’ సినిమాతో నటుడిగా మారిన దశరథ మాధవ్!
Dasaratha Madhav | సమాజంలో మంచి ఉద్యోగం, ఉన్నత చదువులు ఉంటే జీవితం స్థిరపడిపోయిందని చాలామంది భావిస్తారు. కానీ, తన గుండెల్లో గూడుకట్టుకున్న సినిమా కలను సాకారం చేసుకోవడం కోసం కోట్ల రూపాయల కొలువును, ఐఐటీ హోదాను సైతం పక్కన పెట్టి ముందుకు సాగిన ఒక సాహసి ప్రయాణమే ఇది.
Dasaratha Madhav | సమాజంలో మంచి ఉద్యోగం, ఉన్నత చదువులు ఉంటే జీవితం స్థిరపడిపోయిందని చాలామంది భావిస్తారు. కానీ, తన గుండెల్లో గూడుకట్టుకున్న సినిమా కలను సాకారం చేసుకోవడం కోసం కోట్ల రూపాయల కొలువును, ఐఐటీ హోదాను సైతం పక్కన పెట్టి ముందుకు సాగిన ఒక సాహసి ప్రయాణమే ఇది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన అయినబత్తిన దశరథ మాధవ్ అసాధారణ ప్రయాణం నేడు సినీ వర్గాల్లో విశేష చర్చనీయాంశంగా మారింది. ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించి, టాటా ఏరో స్పేస్‌లో ఉన్నత ఉద్యోగం చేసిన దశరథ మాధవ్.. వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చేసిన పోరాటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. చిన్నతనంలో ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన మాటలను గుండెల్లో దాచుకున్న ఆయన, తన చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండానే లక్ష్యం వైపు అడుగులు వేశారు. పదో తరగతిలో డిస్ట్రింక్షన్, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించి ఐఐటీ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఆపై ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి మాస్టర్స్ పూర్తి చేసి ఆదిభట్ల టాటా ఏరో స్పేస్‌లో ఉద్యోగం సంపాదించారు.
అయితే ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ ఆయన మనసు ఎప్పుడూ కళారంగం చుట్టూనే పరిభ్రమించేది. డైలీ క్యాబ్‌లో ఆఫీసుకు వెళ్లే సమయంలో రేడియో మిర్చి వింటూ తనలోని సృజనాత్మకతకు పదును పెట్టుకున్నారు. అదే సమయంలో రేడియో మిర్చి – ఈటీవీ సౌజన్యంతో నిర్వహించిన ‘వాయిస్ పాషన్ షో’ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. సుమారు యాభై వేల మంది పోటీ పడిన ఈ వేదికపై తన ప్రతిభను చాటుకుని టైటిల్ విన్నర్‌గా నిలిచారు. ఆ తర్వాత సుమ నిర్వహించిన ‘జంక్షన్’ కార్యక్రమానికి వచ్చి కామెడీ స్కిట్స్ రచయితగా మాత్రమే కాకుండా, నటుడిగానూ తనలోని విభిన్న కోణాలను ప్రదర్శించారు. అలా మొదలైన ఆయన ప్రయాణం క్రమంగా డిజిటల్ మీడియా రంగం వైపు, అక్కడి నుంచి వెండితెర వైపు మళ్లింది. టీవీ5 డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ విభాగంలో క్రియేటివ్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సెలబ్రిటీల ఇంటర్వ్యూలు మరియు విభిన్న కంటెంట్ రూపకల్పనలో తన ప్రతిభను చాటుకున్నారు. ఎన్నో అవమానాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఏమాత్రం చలించకుండా ఒక రైతులా కష్టపడి పైకి వచ్చారు.
ఇండస్ట్రీలో ప్రతి నటుడికి ఒక తొలి అడుగు ఎంతో కీలకం. ఆ కోణంలో చూస్తే ‘ఎ మాస్టర్ పీస్’, ‘ప్రేరణ’, ‘బువ్వమ్మ కథలు’, ‘భామ సత్యభామ’ వంటి చిత్రాలు తన సినీ ప్రయాణానికి పునాది వేసినా, దర్శకుడు పూర్వాజ్ తెరకెక్కిస్తున్న ‘కిల్లర్’ సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సైన్స్ ఫిక్షన్ మరియు థ్రిల్లర్ అంశాల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో జ్యోతి పూర్వాజ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నటుడిగా కనిపించడమే కాకుండా, లైన్ ప్రొడ్యూసర్‌గానూ కీలక బాధ్యతలు నిర్వర్తించడం ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. మరోవైపు, తోటి కళాకారులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి ఆర్థిక సహాయం అందిస్తూ తన మానవతా దృక్పథాన్ని కూడా చాటుకున్నారు. తెరవెనుక కంటెంట్ క్రియేటర్‌గా విజయవంతమైన దశరథ మాధవ్, ఇప్పుడు తెరపై తన నటనతో ఏమేరకు మెప్పిస్తారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, వెండితెరపై కూడా అగ్ర నటుడిగా ఎదగాలని ఆశిద్దాం. నటుడిగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న అయినబత్తిన దశరథ మాధవ్‌కు టాలీవుడ్ వర్గాల నుంచి మరియు శ్రేయోభిలాషుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Danger bells | తెలంగాణలో తరుముకొస్తున్న కరువు..! చుక్క నీరు లేక నెర్రెలు వాసిన ప్రాజెక్టులు, చెయ్యిచ్చిన కాంగ్రెస్ : వీడియో
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

