Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత.. ఇటీవల ‘యశోద’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నవంబర్ 11న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. కాగా, గత కొన్నిరోజులుగా మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్‌తో బాధపడుతున్న సమంత.. యశోద రిలీజ్ తర్వాత సినిమాలకు కాస్త విరామం తీసుకుంది. ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ మయోసైటిస్ నుంచి కోలుకుంటోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం కొత్త ఏడాదికి రెండు రోజులు మాత్రమే సమయం ఉడటంతో యాక్టివ్ అయ్యింది. ముందస్తు శుభాకాంక్షలతో ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు పలకరించింది.
కొత్త లక్ష్యాలను నిర్ణయించుకుని కొత్త ఏడాదిలో వాటిని సాధించుకునేందుకు కష్టపడాలని అభిమానులకు సూచించింది. ‘సులభమైన లక్ష్యాల కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. లక్ష్యాలను నిర్దేశించుకునే సమయంలో సాధ్యాసాధ్యాలను గమనించుకోవాలి. సులభమైన, మీరు చేయగలిగే లక్ష్యాలనే పెట్టుకోవాలి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023’ అంటూ పోస్ట్ చేసింది. దీనికి నవ్వుతున్న ఓ ఫోటోను కూడా జత చేసింది. ప్రస్తుతం సామ్ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సామ్ పోస్ట్‌కు రిప్లై ఇస్తున్నారు. కొందరు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పగా.. మరికొందరు తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ కామెంట్లు చేస్తున్నారు.
సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’, విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ అనే ప్రేమకావ్యంలో నటిస్తోంది. వీటితోపాటు పలు బాలీవుడ్ ప్రాజెక్టులకు కూడా సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.