Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Vishwak Sen | యువ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కల్ట్’ (Cult).
Vishwak Sen | యువ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కల్ట్’ (Cult). ఈ సినిమా అక్టోబర్ 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో దూకుడు పెంచిన చిత్ర యూనిట్, ప్రేక్షకులను మరింత చేరువ చేసేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తుంది.
ఇందులో భాగంగా నేడు హైదరాబాద్‌లోని ప్రముఖ సారథి స్టూడియోస్ (Saradhi Studios) వేదికగా భారీ ఎత్తున విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్ నిర్వహిస్తున్నారు. గతంలో టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, నాని లాంటి వారు తమ సినిమాల విజయమే లక్ష్యంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్ మీట్స్‌ను సక్సెస్ఫుల్ స్ట్రాటజీగా ఎంచుకున్నారు. అచ్చం అదే బాటలో ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా తన అభిమానులను నేరుగా కలుసుకుని, సినిమా విశేషాలను పంచుకునేందుకు ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తొలి స్లాషర్ థ్రిల్లర్ జానర్లో వస్తోన్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన గాయత్రీ భరద్వాజ్ నటిస్తుండగా, ప్రముఖ రచయిత తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించారు. ఇక టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండటంతో ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Vishwak Sen Fans Meet Today at Saradhi Studios 💥🤩
#Cult In Theatres October 30th 🔥
#VishwakSen #GayathriBharadwaj https://t.co/8icUyALLYx
— ANANTAPUR CINEMA (@AnantapurCinema) October 25, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

