Ramcharan | గేమ్‌చేంజర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. నాలుగు అవతారాల్లో కనిపించనున్న రామ్‌చరణ్
Ramcharan | ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘గేమ్‌ఛేంజర్' ఒకటి. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ అనగానే ఈ సినిమాపై ఎనౌన్స్మెంట్ నుంచీ అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోల హీరోయిజం పెక్యులర్‌గా ఉంటుంది.
Ramcharan | ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘గేమ్‌ఛేంజర్’ ఒకటి. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ అనగానే ఈ సినిమాపై ఎనౌన్స్మెంట్ నుంచీ అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోల హీరోయిజం పెక్యులర్‌గా ఉంటుంది. అది దొంగ కథ అయితే ఒకలా, ప్రేమికుడైతే ఒకలా, దేశభక్తుడు, సమాజహితం కోరుకునే చైతన్యమూర్తి కథ అయితే ఒక విధంగా… ఏదేమైనా రొటీన్‌గా మాత్రం ఆయన కథలు ఉండవు.
త్వరలో రాబోతున్న శంకర్ ‘ఇండియన్ 2’చిత్రంలో కమల్‌హాసన్ హీరోయిజం ఎలా ఉంటుందో చెప్పేయొచ్చు. మరి ‘గేమ్‌ఛేంజర్’ మాటేంటి? అసలు ఈ సినిమాలో రామ్‌చరణ్‌ని ఆయన ఎలా చూపించబోతున్నాడు? అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్న. కథానుగుణంగా ఇందులో చరణ్ నాలుగు రకాలుగా కనిపిస్తారని సమాచారం.
దేనికవే భిన్నమైన రూపాలన్న మాట. కథ అలా డిమాండ్ చేసింది మరి. శంకర్ సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ అనేది ఎప్పుడూ హైలైట్‌గానే ఉంటుంది. ‘గేమ్‌ఛేంజర్’లో కూడా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని టాక్. అంతేకాదు పలు అంశాలపై ప్రజలకు అవగాహన పెంచేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. శంకర్ ‘ఒకేఒక్కడు’ని మించే స్థాయి సినిమా అని కొందరంటున్నారు. ఈ చిత్రంలో కైరా అద్వాణీ కథానాయికగా నటిస్తున్నది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

