Fish Venkat | టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోయి నడవలేని దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్‌పై చేసిన ఓ వీడియో వలన ఈ విషయం బయటకు వచ్చింది. తన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని తన పరిస్థితి గురించి చెప్పుకుంటూ కొన్ని నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అయితే వెంకట్ పరిస్థితి తెలుసుకున్న సినీ పరిశ్రమ పెద్దలు ఆయనకు ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఆయన పరిస్థితి తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.2 లక్షలు పంపించినట్లు ఒక వీడియోలో చెప్పుకోచ్చారు.
నేను మీ ఫిష్ వెంకట్.. ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి అసలు బాగలేదు. షూగర్, బీపీలతో బాధపడుతున్నాను. అలాగే నా రెండు రెండు కిడ్నీలు చెడిపోయి నడవలేని స్థితిలో ఉన్నాను. ప్రస్తుతం డయాల్సిసిస్ జరుగుతుంది. అయితే ఇంట్లో వాళ్లందరూ నీకు అగ్ర నటులు అందరూ తెలుసు కదా వారిని కలిసి నీ పరిస్థితికి గురించి చెప్పవచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ నేను ఇప్పటివరకు ఏ హీరో దగ్గరికి వెళ్లలేదు. షూటింగ్లో వెళ్లి కలవడం తప్పా ఇలా కలవలేను. అయితే నా పరిస్థితి ఇలా అయ్యాక వెళ్లి కలుద్దామనుకున్నాను. కానీ వెళ్లే పరిస్థితి లేదు.
నా భార్య నన్ను అడుగుతూ.. పవన్ సర్ని వెళ్లి కలవండి అని చెప్పింది. అతడిని కలిస్తే.. మీకు ట్రీట్మెంట్ చేయిస్తాడు. అంటూ ఒత్తిడి చేయడంతో వెళ్లి పవన్‌ని కలిశాను. అతడికి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పాను. వెంటనే ఆయన స్పందించి నాకు చికిత్స అందించారు. అలాగే నా ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పడంతో రూ.2 లక్షల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయించారు. ఆయనకు నా పాదాభివందనాలు. పవన్ కళ్యాణ్ సర్.. ఆయన్ కుటుంబం బాగుండాలని లక్ష్మీ నరసింహ స్వామివారిని వేడుకుంటున్నా అంటూ ఫిష్ వెంకట్ ఎమోషనల్ వీడియో పెట్టారు.
.@PawanKalyan sir immediately gave me 2 lacs for my treatment. He’s like a family to me.
-Artist Fish Venkat. pic.twitter.com/PamAzMyfVf— Telugu Chitraalu (@TeluguChitraalu) January 1, 2025