Firestorm Video Song | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘దే కాల్ హిమ్ ఓజీ’ నుంచి విడుదలైన ఫస్ట్ బ్లాస్ట్ సాంగ్ ‘ఫైర్ స్ట్రోమ్’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పవన్ మాస్ లుక్, తమన్ అందించిన హై ఎనర్జీ బీట్స్, పవర్ఫుల్ విజువల్స్ ఫ్యాన్స్‌కి గూస్బంప్స్ తెప్పించాయి. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోల్లో ‘ఫైర్ స్ట్రోమ్’ రెండో స్థానంలో నిలిచింది. దీనిపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ “అన్‌స్టాపబుల్ స్టార్మ్” అంటూ సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన కూడా చేసింది. ఇక ఇప్పుడు ఈ పాటకి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.
ప్రస్తుతం ఓజీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక మధ్య మధ్యలో చిత్రంకి సంబంధించి వీడియో సాంగ్స్‌ని మేకర్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఫైర్ స్మార్ట్ వీడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో పవన్ అభిమానులు ఫుల్ జోష్‌లో కామెంట్లు చేస్తున్నారు.ఈ పాటకి కోలీవుడ్ స్టార్ శింబుతో పాటు తమన్, నజీరుద్దీన్, భరద్వాజ్, దీపక్ బ్లూ వాయిస్ ఇచ్చారు. తెలుగు లిరిక్స్‌ను విశ్వ, శ్రీనివాస్ రాయగా, ఇంగ్లీష్ లైన్స్‌ను రాజకుమారి రాశారు. జపనీస్ లిరిక్స్‌ను అద్వితీయ వొజ్జాల అందించారు. “అలలిక కదలక భయపడెలే… ప్రళయం ఎదురుగా నిలబడెలే… ఓజెస్ గంభీర…” అంటూ సాగే లైన్స్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
సాంగ్‌లో పవన్ యాక్షన్ లుక్, సమురాయ్ వైబ్స్, గ్యాంగ్‌స్టర్ ఎటిట్యూడ్ ప్రేక్షకులను బ్లాక్‌బస్టర్ ఫీలింగ్‌లోకి తీసుకెళ్లాయి. ఈ సినిమాలో ఆయన సమురాయ్ స్టైల్ వారియర్‌గా కనిపించి సందడి చేశారు. ‘సాహో’ ఫేం సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించారు. పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించారు.. ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి కీలక పాత్రల్లో నటించి అలరించారు. 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన ఓజీ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.