Yash 19 | కేజీఎఫ్ ప్రాంచైజీతో శాండల్‌వుడ్ రేంజ్‌ను ప్రపంచవ్యాప్తం చేశాడు యశ్ (Yash). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్, కేజీఎఫ్ చాఫ్టర్ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాల తర్వాత యశ్ మరో కొత్త ప్రకటించకపోవడంతో అభిమానులు తీవ్రనిరాశలో మునిగిపోయారు. ఇదే నెలలో యశ్ 19 (Yash 19)అప్డేట్ వచ్చేస్తుందంటూ ఇప్పటికే చాలా నెలలు గడిచిపోయాయి. మూవీ లవర్స్, అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది.
తాజా టాక్ ప్రకారం యశ్ 19కు సంబంధించిన కొత్త వార్త నవంబర్ 1న రాబోతుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం యశ్ 19 డిసెంబర్ చివరలో షూటింగ్ షురూ కానుంది. శ్రీలంకలో 45 రోజులపాటు సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ షూట్‌ను 90 శాతం శ్రీలంకలో, 10 శాతం బెంగళూరులో నిర్వహించనుండగా.. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా షురూ అయినట్టు ఇన్సైడ్ టాక్. నెట్టింట హల్ చల్ చేస్తున్న వార్తలపై అఫీషియల్ కాకున్నా.. ఈ అప్డేట్స్ మాత్రం అందరినీ ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.
యశ్ ఈ ఏడాది జులైలో మలేషియాలో జరిగిన ఓ ఈవెంట్లో యశ్19 మూవీ గురించి మాట్లాడుతూ.. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం చాలా హార్ట్ వర్క్ చేస్తున్నా. ఈ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని చెప్పను.. కానీ ఇది ఒక మంచి, అద్భుతమైన సినిమా కానుంది.ఈ సినిమాను త్వరలోనే ప్రకటిస్తా. ఓపిక పట్టండి. నన్ను నమ్మండి. మీ అంచనాలకు తగ్గకుండా అదిరిపోయే కిక్కించేలా సినిమా ఉంటుందని మాత్రం చెప్పగలను.. అంటూ క్లారిటీ ఇచ్చాడని తెలిసిందే.
పాపులర్ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ (KVN Production) యశ్‌తో 19వ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి. మరి యశ్ 19ని నిర్మించబోయేది ఈ బ్యానరేనా..? వేరే బ్యానర్లో వస్తుందా..? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
Exclusive
🔹#Yash19 Shooting December Month Start 📢 Set Work Already Start
Follow For More update 🙏
🔸First Schedule “SaiLanka” 90% Shoot Next Schedule “Bangalore” 10% Remaining#Yash #GeethuMohandas #YashBOSS #Yash20 #YashBOSS𓃵 #KVNProduction #KGF3 pic.twitter.com/Y4lrXo6ur2
— Movie Tamil (@MovieTamil4) October 26, 2023