Filmfare OTT Awards | మెగా హీరో సాయి ధరమ్ తేజ్, స్వాతి నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’ షార్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది. వెబ్ సిరీస్ నటులు ప్రెస్టిజీయస్గా భావించే ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల (Filmfare OTT Awards 2024) వేడుక ఆదివారం రాత్రి ముంబై వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీ నుంచి సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఓటీటీ సినిమా విభాగంలో ఉత్తమ నటుడిగా పంజాబీ గాయకుడు దిల్జిత్ దొసాంజ్ అవార్డు అందుకోగా.. ఉత్తమ నటిగా కరీనా కపూర్ అవార్డును దక్కించుకుంది. తెలుగు నుంచి సాయి ధరమ్ తేజ్, స్వాతి నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’ పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది. ఇక ఎవరెవరు ఏ విభాగంలో అవార్డు దక్కించుకున్నారు అనేది చూసుకుంటే..
వెబ్ సిరీస్‌లకు సంబంధించిన విజేతలు వీరే:
ఉత్తమ సిరీస్: ది రైల్వే మెన్
ఉత్తమ దర్శకుడు : సమీర్ సక్సేనా మరియు అమిత్ గోలానీ (కాలా పానీ)
ఉత్తమ నటుడు (కామెడీ): రాజ్‌కుమార్ రావు (గన్స్ అండ్ గులాబ్స్)
ఉత్తమ నటుడు (డ్రామా): గగన్ దేవ్ రియర్ (స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ)
ఉత్తమ సిరీస్ నటి (కామెడీ): గీతాంజలి కులకర్ణి (గుల్లక్ సీజన్ 4)
ఉత్తమ నటి (డ్రామా): మనీషా కొయిరాలా (హీరామండి: ది డైమండ్ బజార్)
ఉత్తమ సహాయ నటుడు (కామెడీ) : ఫైసల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటుడు (డ్రామా): ఆర్ మాధవన్ (ది రైల్వే మెన్)
ఉత్తమ సహాయ నటి, కామెడీ: నిధి బిష్త్ (మామ్లా లీగల్ హై)
ఉత్తమ సహాయ నటి, సిరీస్ డ్రామా: మోనా సింగ్ (మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2)
ఉత్తమ ఒరిజినల్ స్టోరీ : బిశ్వపతి సర్కార్ (కాలా పానీ)
ఉత్తమ కామెడీ (సిరీస్): మామ్లా లీగల్ హై
ఉత్తమ నాన్ ఫిక్షన్ ఒరిజినల్ : ది హంట్ ఫర్ వీరప్పన్
ఉత్తమ డైలాగ్ : సుమిత్ అరోరా (గన్స్ అండ్ గులాబ్స్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : AJ నిడిమోరు, కృష్ణ DK మరియు సుమన్ కుమార్ (గన్స్ & గులాబ్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, సిరీస్: కిరణ్ యాద్న్యోపవిత్, కేదార్ పాటంకర్ మరియు కరణ్ వ్యాస్ (స్కామ్ 2003 – ది తెల్గి స్టోరీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్, : సుదీప్ ఛటర్జీ (ISC), మహేష్ లిమాయే (ISC), హుయెన్‌స్టాంగ్ మోహపాత్రా మరియు రగుల్ హెరియన్ ధరుమాన్ (హీరమండి: ది డైమండ్ బజార్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సుబ్రతా చక్రవర్తి మరియు అమిత్ రాయ్ (హీరమండి: ది డైమండ్ బజార్)
ఉత్తమ ఎడిటింగ్ : యషా జైదేవ్ రాంచందనీ (ది రైల్వే మెన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : రింపుల్, హర్‌ప్రీత్ నరులా మరియు చంద్రకాంత్ సోనావానే (హీరమండి: ది డైమండ్ బజార్)
ఉత్తమ నేపథ్య సంగీతం : సామ్ స్లేటర్ (ది రైల్వే మెన్)
ఉత్తమ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ : సంజయ్ లీలా భన్సాలీ, రాజా హసన్ మరియు శర్మిష్ట ఛటర్జీ (హీరామండి: ది డైమండ్ బజార్)
ఉత్తమ VFX : ఫిల్మ్‌గేట్ AB మరియు హైవ్ స్టూడియోస్ (ది రైల్వే మెన్)
ఉత్తమ సౌండ్ డిజైన్ : సంజయ్ మౌర్య మరియు ఆల్విన్ రెగో (కాలా పానీ)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : శివ్ రావైల్ (ది రైల్వే మెన్)
ఓటీటీ సినిమా విజేతలు
ఉత్తమ చిత్రం : అమర్ సింగ్ చమ్కిలా
ఉత్తమ దర్శకుడు : ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చమ్కిలా)
ఉత్తమ నటుడు : దిల్జిత్ దోసాంజ్ (అమర్ సింగ్ చమ్కిలా)
ఉత్తమ నటి : కరీనా కపూర్ ఖాన్ (జానే జాన్)
ఉత్తమ సహాయ నటుడు : జైదీప్ అహ్లావత్ (మహారాజ్)
ఉత్తమ సహాయ నటి : వామికా గబ్బి (ఖుఫియా)
ఉత్తమ డైలాగ్ : ఇంతియాజ్ అలీ మరియు సాజిద్ అలీ (అమర్ సింగ్ చమ్కిలా)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : ఇంతియాజ్ అలీ మరియు సాజిద్ అలీ (అమర్ సింగ్ చమ్కిలా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సిల్వెస్టర్ ఫోన్సెకా (అమర్ సింగ్ చమ్కిలా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : సుజానే కాప్లాన్ మెర్వాంజీ (ది ఆర్చీస్)
ఉత్తమ ఎడిటింగ్ : ఆర్తి బజాజ్ (అమర్ సింగ్ చమ్కిలా)
ఉత్తమ నేపథ్య సంగీతం : AR రెహమాన్ (అమర్ సింగ్ చమ్కిలా)
ఉత్తమ సౌండ్ డిజైన్ : ధీమాన్ కర్మాకర్ (అమర్ సింగ్ చమ్కిలా)
ఉత్తమ కథ : జోయా అక్తర్, అర్జున్ వరైన్ సింగ్ మరియు రీమా కగ్తీ (ఖో గయే హమ్ కహాన్)
ఉత్తమ సంగీత ఆల్బమ్ : ఏఆర్ రెహమాన్ (అమర్ సింగ్ చమ్కిలా)
ఉత్తమ నూతన దర్శకుడు : అర్జున్ వరయిన్ సింగ్ (ఖో గయే హమ్ కహాన్)
ఉత్తమ నూతన నటుడు : వేదంగ్ రైనా
ఉత్తమ సిరీస్ : గన్స్ మరియు గులాబ్స్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) : ముంబై డైరీస్ సీజన్ 2
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): డ్రామా: కే కే మీనన్ (బాంబై మేరీ జాన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): డ్రామా: హుమా ఖురేషి (మహారాణి S03)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జానే జాన్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – చిత్రం: జైదీప్ అహ్లావత్
ఉత్తమ నటి (క్రిటిక్స్) – చిత్రం: అనన్య పాండే
ప్రత్యేక గుర్తింపు: అర్జున్ వరయిన్ సింగ్ (ఖో గయే హమ్ కహాన్)