మణికంఠ, ఐరా బన్సాల్ జంటగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఫైటర్ శివ’. ఇందులో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ నిమ్మల దర్శకుడు. నర్సింగ్, ఉన్నం రమేశ్ నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. అగ్ర దర్శకుడు సంపత్ నంది ఈ పోస్టర్ని ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని మేకర్స్ తెలిపారు. వికాస్ వశిష్ట, మధుసూదన్, యోగి కాట్రి, దిల్ రమేశ్, లక్ష్మణ్, అభయ్, ఆనంద్ భారతి, ఘర్షణ శ్రీనివాస్, మాస్టర్ శన్విత్ నిమ్మల తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సంజీవ్ లోక్‌నాథ్, సంగీతం: గౌతమ్ రఘురాం, నిర్మాణం: అరుణగిరి ఆర్ట్స్.