Fighter Movie | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫైటర్'(Fighter). అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండగా.. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీకి ఇంకా నెల రోజులు ఉండటంతో మేకర్స్ ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్‌తో పాటు ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల వద్ద నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ రొమాంటిక్ సెకండ్ సింగిల్ ఇష్క్ జైసా కుచ్ (Ishq jaisa Kuch) పాటను విడుదల చేశారు. ఇందులో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ఫుల్ హాట్ మోడ్‌లో ఉండగా.. వారిద్దరి కెమిస్ట్రీ ఫాన్స్ ను ఫిదా చేస్తుంది.
వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించనుండగా.. స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా (దీపికా పదుకొనే).. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నాడు.