Fighter Movie | షేర్ ఖుల్ గయే.. హృతిక్ రోషన్ ‘ఫైటర్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
Fighter Movie | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'ఫైటర్'(Fighter). వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల ఫేమ్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
Fighter Movie | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫైటర్'(Fighter). వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల ఫేమ్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీకి ఇంకా నెల రోజులు ఉండటంతో మేకర్స్ ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్లతో పాటు విడుదలైన మూవీ టీజర్‌కు ప్రేక్షకుల వద్ద నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ (Fighter first Single)ను విడుదల చేశారు. “షేర్ ఖుల్ గయే” (Sher Khul Gaye) అంటూ సాగే ఈ పార్టీ సాంగ్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వదిలింది. ఈ పాటలో హృతిక్ రోషన్ , దీపికా పదుకొనె డాన్స్ మూమెంట్స్ ఫాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించనుండగా.. స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా (దీపికా పదుకొనే).. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

