Fighter Movie | గత ఏడాది షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ‘పఠాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఇక ఇదే ఊపులో ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఫైటర్’ (Fighter). బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇదిలావుంటే మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు. ‘ఫైటర్’ అడ్వాన్స్ బుకింగ్స్ (Fighter Movie Advance Bookings) ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ అయ్యినట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎగబడుతుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తాయని చిత్రబృందం ధీమాగా ఉంది. ఇక ఇండియా ఫస్ట్ ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ మూవీలో కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేఖ్, తలత్ అజిజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
HRITHIK – DEEPIKA – ANIL KAPOOR: ‘FIGHTER’ ADVANCE BOOKINGS START… Team #Fighter commences nationwide advance bookings of the much-awaited aerial action-drama.
Directed by #SiddharthAnand… In *cinemas* [Thu] 25 Jan 2024 [#RepublicDay weekend].… pic.twitter.com/deSsRHigbF
— taran adarsh (@taran_adarsh) January 20, 2024