e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Bigg Boss: పేడ‌లో ప‌డి దొర్లిన లోబో,ష‌ణ్ముఖ్‌..!

Bigg Boss: పేడ‌లో ప‌డి దొర్లిన లోబో,ష‌ణ్ముఖ్‌..!

కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు చుక్క‌లు చూపించాడు. లోబో, షణ్ముఖ్‌ ఆవుపేడతో ఆటలాడగా.. సిరి, రవి స్విమ్మింగ్‌ఫూల్‌లో సీసాలు ఏరారు. మరోవైపు మానస్‌, శ్రీరామచంద్రలు చమటలు పట్టేలా తాళ్లను ఊపారు. మొద‌ట‌గా అభ‌య‌హ‌స్తం అనే టాస‌క్ ఇవ్వ‌గా, ఇందులో హౌస్ మొత్తం లాక్ డౌన్‌లోనే ఉంటుందని.. ఇంటి సభ్యులంతా గార్డెన్ ఏరియాలోనే ఉంటారని చెప్పారు.

- Advertisement -

ఇంటి స‌భ్యులు లోప‌లికి వెళ్లాలంటే కెప్టెన్సీ పోటీదారులు మొత్తం ఐదు ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. టాస్కులో గెలిచి కెప్టెన్సీ కంటెస్టెంట్ గా సెలక్ట్ అయిన సభ్యులు మాత్రమే ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. అయితే ఎవ‌రు పోటీప‌డ‌తారు అనేది ఏకాభిప్రాయంతో బిగ్ బాస్‌కి తెల‌పాల్సి ఉంటుంది. మొదటి ఛాలెంజ్‌లో ఓడిపోయిన సభ్యులు కూడా రెండో ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశం ఉండ‌దని చెప్పారు బిగ్ బాస్.

తొలి ఛాలెంజ్‌కి లోబో, ష‌ణ్ముఖ్ సిద్ధం అయ్యారు. ఇప్పటివరకూ కెప్టెన్ పోటీదారులుగా అర్హత సాధించలేకపోవ‌డంతో షణ్ముఖ్, లోబోలకు అవకాశం ఇచ్చారు.ఈ టాస్క్‌లో పేడ కలిపిన మట్టిలో కొన్ని ముత్యాలను ఉంచారు.. ఆ ముత్యాలను ఒక్కొక్కటిగా వెతికిపట్టాలని ఎవరు ఎక్కువ ముత్యాలను వెతికిపట్టుకుంటారో వాళ్లే ఈ టాస్క్‌లో విజేతలు అవుతారని చెప్పారు బిగ్ బాస్. టాస్క్ కోసం లోబో, ష‌ణ్ముఖ్ తీవ్రంగా శ్ర‌మించారు.షన్నూ 101 ముత్యాలను ఏరి లోబో(74)పై విజయం సాధించాడు. అయితే ష‌ణ్ముఖ్ ముత్యాలు నీట్‌గా లేవ‌ని విమ‌ర్శ‌లు రావ‌డంతో నీట్‌గా ఉండటం మ్యాటర్ కాదు.. ఎక్కువ తీయాలంతే అని చెప్పుకొచ్చింది. ఎట్ట‌కేల‌కు ష‌ణ్ముఖ్ విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న‌కు టైట్ హ‌గ్ ఇచ్చింది సిరి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement