Bro Movie Record | నిన్న విడుదలైన బ్రో మూవీ మోషన్ పోస్టర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో మోషన్ పోస్టర్ ఉండటంతో యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చి పడుతున్నాయి. ఇక పవన్ కూడా చాలా కాలం తర్వాత అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. స్టైల్, యాటిట్యూడ్, స్వాగ్ ఇలా మూడింటి కలబోతతో ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఇవన్నీ ఒకత్తయితే.. థమన్ నేపథ్య సంగీతం వేరే లెవల్. గూస్బంప్స్ అన్న పదం కూడా చాలదేమో అన్న రీతిలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. కాగా తాజాగా ఈ మోషన్ పోస్టర్ సంచలన రికార్డు క్రియేట్ చేసింది.
వేగంగా 5 మిలియన్ల వ్యూస్ సాధించిన మోషన్ పోస్టర్‌గా టాలీవుడ్లో సరికోత్త రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు ఈ రికార్డు రాధేశ్యామ్ పేరిట ఉంది. కేవలం మోషన్ పోస్టర్‌తోనే ఈ రేంజ్లో రికార్డులు నమోదవుతున్నాయంటే ఇంక సినిమా ఏ రేంజ్లో ఉండనుందో అని అభిమానులు ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో కోట్ల ప్రశంసలు దక్కించుకున్న ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ కథలో పలు మార్పులు చేర్పులు చేశాడు.
Records are ought to bow on his Arrival 💥🔥#BroTheAvatar https://t.co/APudV3bY6z@PawanKalyan @IamSaiDharamTej @thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @bkrsatish @TheKetikaSharma@NavinNooli@ZeeStudios_ @zeestudiossouth#BroTheAvatarFromJuly28🌀 pic.twitter.com/qxuRr3GF4b
— People Media Factory (@peoplemediafcy) May 19, 2023