జాతిరత్నాలు సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ డమ్ సంపాదించింది హైదరాబాదీ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా (Faria abdullah). ఈ బ్యూటీ డ్యాన్స్ ఏ రేంజ్లో ఇరగదీస్తుందో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను చూస్తే తెలిసిపోతుంది. తన డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ తో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించి జాతిరత్నాలు చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో కూడా మెరిసింది.
ఇక పవన్ కల్యాణ్ (Pawan Kalyan)నటిస్తోన్న భీమ్లా నాయక్ (Bheemla Nayak) చిత్రంలో లాలా భీమ్లా సాంగ్ ఓ రేంజ్లో దుమ్ము రేపుతోంది. పవన్ కల్యాణ్ మ్యానరిజానికి మాస్ బీట్ యాడ్ అయి (lala bheemla song) లాలా భీమ్లా..అడవి పులి..గొడవ పడి ఒడిసి పట్టు..దంచి కొట్టూ..కత్తి పట్టూ..అదరగొట్టూ అంటూ సాగే ఊరమాస్ పాటకు ఫరియా అబ్దుల్లా ఇరగదీసే స్టెప్పులేసింది. బ్లాక్ జిమ్ వేర్లో ఉన్న ఫరియా అబ్దుల్లా తన డ్యాన్స్ పార్ట్నర్ తో కలిసి అదిరిపోయే డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.
#LalaBheemla song craze 💥
— Missile PawanKalyan™ (@MissilePSPK) December 7, 2021
In frame :- @fariaabdullah2 #BHEEMLANAYAKon12thJAN#BheemlaNayak • @PawanKalyan @MusicThaman pic.twitter.com/33rbn1kWPF
ఈ పాట పాడిన అరుణ్ కౌండిన్య కూడా మరో సింగర్‌తో కలిసి ఇదే పాటకు డ్యాన్స్ చేసి అదరగొట్టాడు.
~ @arun_kaundinya voice in #LalaBheemla song 🙏💥💥
— Missile PawanKalyan™ (@MissilePSPK) December 2, 2021
Em padav anna 👌🔥#BheemlaNayak • @PawanKalyan @MusicThaman pic.twitter.com/5JJnPtMnEg
ఇవి కూడా చదవండి..
Sara Ali Khan Heartfelt Note | సారా అలీఖాన్ భావోద్వేగ పోస్ట్..కారణమిదే
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
Upasana lehenga outfit | ఉపాసన 9 ఏండ్ల తర్వాత మళ్లీ ఇలా..ట్రెండింగ్ అవతార్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్