‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టీ పాత్ర ద్వారా యువతరానికి చేరువైంది హైదరాబాదీ సొగసరి ఫరియా అబ్దుల్లా. ప్రస్తుతం ఈ భామ ‘మత్తు వదలరా-2’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. శ్రీసింహా కోడూరి హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఇదొక థ్రిల్లర్ సబ్జెక్ట్. కథలోని విషాదం నుంచే కామెడీ పుడుతుంది. శ్రీసింహా తొలిభాగంలో డెలివరీ బాయ్‌గా కనిపించగా..ఈ సీక్వెల్లో స్పెషల్ ఏజెంట్‌గా కనిపిస్తారు.
సినిమాలో నా పాత్ర పేరు సన్నిధి. తను కూడా స్పెషల్ ఏజెంట్’ అని చెప్పింది. ఈ సినిమాలో తాను యాక్షన్ సీక్వెన్స్‌లో నటించానని, గన్స్ పట్టుకొని పోరాటాలు చేయడం కొత్త అనుభూతినిచ్చిందని, అలాగే ఓ పాటను రాసి పాడానని ఫరియా అబ్దుల్లా చెప్పింది.
‘ఈ టీమ్ అన్ని అంశాల్లో నన్ను ఎంకరేజ్ చేసింది. మళ్లీ వారితో పనిచేయాలనుంది’ అని ఆమె పేర్కొంది. ప్రస్తుత తెలుగులో తిరువీర్‌తో కలిసి ఓ లవ్‌స్టోరీలో నటిస్తున్నానని, త్వరలో ఓ తమిళ చిత్రం కూడా ప్రారంభం కాబోతుందని ఫరియా అబ్దుల్లా తెలిపింది.