e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News ఫ‌ర్హాన్ పంచ్‌.. తుఫాన్ ట్రైల‌ర్ రిలీజ్‌

ఫ‌ర్హాన్ పంచ్‌.. తుఫాన్ ట్రైల‌ర్ రిలీజ్‌

ముంబై : బాలీవుడ్ న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్ న‌టించిన తుఫాన్ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. స్ట్రీట్ ఫైట‌ర్ నుంచి మేటి బాక్స‌ర్‌గా అజీల్ అలీ అనే వ్య‌క్తి ఎలా మారాడాన్న క‌థాంశంతో చిత్రాన్ని తెర‌కెక్కించారు. రాకేశ్ ఓం ప్ర‌కాశ్ మెహ్రా ఈ సినిమాను డైర‌క్ట్ చేస్తున్నారు. ఫ‌ర్హాన్ న‌టించిన‌ భాగ్ మిల్కా భాగ్ చిత్రాన్ని కూడా ఓం ప్రకాశ్ డైర‌క్ట్ చేశాడు. ఆ సినిమాలో మిల్కా సింగ్ పాత్ర‌ను ఫ‌ర్హాన్ అక్త‌ర్ పోషించిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ ఓసారి క్రీడాకారుడి క‌థాంశంతో ఫ‌ర్హాన్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నున్నాడు. మృణాల్ థాకూర్‌, ప‌రేశ్ రావ‌ల్‌, సుప్రియా పాఠ‌క్ క‌పూర్‌లు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తుఫాన్ సినిమా జూలై 16వ తేదీన రిలీజ్‌ కానున్న‌ది.

బాక్సింగ్ డ్రామా..

- Advertisement -

బాక్సింగ్ క‌థాంశం నేప‌థ్యంలో తుఫాన్ సినిమా సాగుతుంది. ముంబైలోని డోంగ్రీకి చెందిన అజీల్ అలీ పాత్ర‌ను ఫ‌ర్హాన్ పోషిస్తున్నాడు. ఓ గుండా అయిన అజీజ్ త‌నపై ఉన్న నేర‌స్థుడ‌న్న ముద్ర‌ను తొల‌గించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. దానిలో భాగంగానే అత‌ను బాక్స‌ర్ అవుతాడు. బాక్సింగ్ కోచ్ పాత్ర‌ను ప‌రేశ్ రావ‌ల్ పోషించాడు. ఇక హీరోయిన్‌గా మృణాల్ థాకూర్ న‌టిస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana