Ustad Zakir Hussain | ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో చేరారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, ఫ్లూట్ ప్లేయర్ రాకేశ్ చౌరాసియా వెల్లడించారు. ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారని.. ఐసీయూలో చేర్చినట్లు పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన హైబీపీతో బాధపడుతున్నారని రాకేశ్ చౌరాసియా పేర్కొన్నారు. ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తున్నది. ఈ క్రమంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తండ్రి అల్లా రఖా సైతం ప్రముఖ తబలా వాయిద్యాకారుడే. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ 1951లో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జన్మించారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ప్రపంచంలోని గొప్ప తబలా వాద్యకారుల్లో ఒకరు. జాకీర్ హుస్సేన్ చిన్నతనం నుంచే తలబా వాయించడం మొదలుపెట్టారు. ఏడేళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
అలాగే, 1990లో భారత ప్రభుత్వ నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 2018లో రత్న సదస్యను అందుకున్నారు. హుస్సేన్ మిక్కీ హార్ట్, గియోవన్నీ హిడాల్గోతో కలిసి గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ సంగీత ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. గెలుచుకున్నారు. హుస్సేన్ నాలుగు విజయాలతో ఏడు గ్రామీ అవార్డు ప్రతిపాదనల వరకు వెళ్లగా.. ఫిబ్రవరి 2024లో మూడు గ్రామీలను కూడా స్వీకరించారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ (1988), పద్మభూషణ్ (2002), పద్మవిభూషణ్ (2023)లతో సత్కరించింది. 1999లో యూఎస్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ ద్వారా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్తో సత్కరించారు. ఆ తర్వాత ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు. తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయనను వైట్‌హౌస్‌కు ఆహ్వానం అందుకున్నారు. తొలిసారిగా వైట్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ సంగీతకారుడు. ఆయన 1980వ దశకంలో పలు చిత్రాలకు సైతం పని చేశారు.
Ustad Zakir Hussain, Tabla player, percussionist, composer, former actor and the son of legendary Tabla player, Ustad Allah Rakha is not well. He’s being treated for serious ailments in a San Francisco hospital, USA, informed his brother in law, Ayub Aulia in a phone call with… pic.twitter.com/6YPGj9bjSp
— Pervaiz Alam (@pervaizalam) December 15, 2024