Kubera | వివాదంలో శేఖర్ కమ్ముల కుబేర.. ఇంతకీ ఏమైందంటే?
తమిళ నటుడు ధనుష్ హీరోగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘కుబేర’ చిత్రం వివాదంలో చిక్కుకున్నది.
- తమ టైటిల్‌ను వేరేవారు కాపీ కొట్టారంటున్న నిర్మాత కర్మికొండ
Kubera | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): తమిళ నటుడు ధనుష్ హీరోగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘కుబేర’ చిత్రం వివాదంలో చిక్కుకున్నది. ‘కుబేర’ టైటిల్ తమదని, దాన్ని వేరేవారు కాపీ కొట్టి సినిమా తీయడం అన్యాయమని నిర్మాత కర్మికొండ నరేంద్ర ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కుబేర’ టైటిల్‌ను తెలంగాణ ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేసుకున్నామని, ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డబ్బింగ్ దశలో ఉన్నదని చెప్పారు.
తాము రిజిస్టర్ చేసుకున్న టైటిల్‌ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ వారు కాపీ కొట్టి ఇటీవల సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారని అన్నారు. దీనిపై ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. ‘కుబేర’ టైటిల్ విషయంలో ఎంతటి న్యాయపోరాటానికైనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ టైటిల్ తమకే దక్కేలా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చర్యలు తీసుకోవాలని నరేంద్ర కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

