విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’ చిత్రంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ పాట చక్కటి రొమాంటిక్ మెలోడీగా సంగీతప్రియుల్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటను సిధ్శ్రీరామ్ ఆలపించగా..అనంత్ శ్రీరామ్ రచన చేశారు. తాజాగా ఇదే కాంబో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’లో ఓ పాట కోసం వర్క్ చేశారు. దిల్రాజు-శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.
మృణాల్ ఠాకూర్ కథానాయిక. మంగళవారం నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులోభాగంగా ‘నందనందనా..’ అనే లిరికల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ నెల 7న పూర్తి పాటను రిలీజ్ చేయబోతున్నారు. ‘ఇంకేం ఇంకేం కావాలి..’ పాట తరహాలోనే ‘నందనందనా..’ చక్కటి ప్రేమగీతంగా ఆకట్టుకుంటుందని, నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్, సంగీతం: గోపీసుందర్, రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల.