కాశీ యాత్ర
అనగనగా ఓ కుటుంబం తరహా కథలు చాలా అందంగా ఉంటాయి. ఆ కుటుంబంలో వింత మనుషులు ఉంటే అవి మరింత బాగుంటాయి. ఆ కథలు కమర్షియల్ ఫార్ములాకు అతీతంగా చిత్రాలు నిర్మించే మలయాళ సినీ ఇండస్ట్రీలో పుడితే ఆలోచింపజేసేలా రూపుదిద్దుకుంటాయి.
ఫ్యామిలీ డిస్నీ హాట్‌స్టార్: డిసెంబర్ 18
తారాగణం: బాసిల్ జోసెఫ్, జగదీశ్, మంజుల పిైళ్లె, అభిరామ్ రామకృష్ణ తదితరులు
దర్శకత్వం: నితీశ్ సహదేవ్
అనగనగా ఓ కుటుంబం తరహా కథలు చాలా అందంగా ఉంటాయి. ఆ కుటుంబంలో వింత మనుషులు ఉంటే అవి మరింత బాగుంటాయి. ఆ కథలు కమర్షియల్ ఫార్ములాకు అతీతంగా చిత్రాలు నిర్మించే మలయాళ సినీ ఇండస్ట్రీలో పుడితే ఆలోచింపజేసేలా రూపుదిద్దుకుంటాయి. మదిని హత్తుకునేలా తెరకెక్కుతాయి. నితీశ్ సహదేవ్ దర్శకత్వం వహించిన ‘ఫ్యామిలీ’ ఇదే తరహా చిత్రం. ఇందులో ఆడంబరాల్లేవు. అతిశయోక్తులు అస్సల్లేవు. కథ నేల విడిచి సాము చేయలేదు. పాత్రలు పరిధి దాటి ప్రవర్తించలేదు. పెద్దగా మిస్టరీలు లేవు. హాస్యం, భావోద్వేగాల కలబోతగా సిద్ధమైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటీలోనూ రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్నది.
మలయాళంతోపాటు హిందీ, తెలుగు వెర్షన్లూ అందుబాటులో ఉన్నాయి. కథలోకి వెళ్తే.. ఓ కుటుంబంలో అమ్మానాన్న, ఇద్దరు కొడుకులు, ఓ తాతయ్య ఉంటారు. తండ్రికి ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. కానీ, దాన్ని పట్టించుకోడు. దమ్మిడీ సంపాదించకుండా ఇంట్లోనే ఉంటుంటాడు. తల్లి మరో ప్రెస్‌లో ఉద్యోగినిగా పనిచేస్తూ ఉంటుంది. పెద్ద కొడుకు అనూప్ (బాసిల్ జోసెఫ్) డబ్బింగ్ ఆర్టిస్టుగా చేస్తుంటాడు. చిన్నోడు యూకే వెళ్లి చదువుకోవాలని అనుకుంటుంటాడు. తాతయ్య మాత్రం తరచూ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైల్వే స్టేషన్‌కు వెళ్లిపోతుంటాడు. చచ్చేలోపు కాశీ వెళ్లాలనేది ఆయన కోరిక.
ఇంట్లోవాళ్లు తీసుకెళ్తామని చెప్పినా ఆయన నమ్మడు. ఎందుకంటే.. ఆ ఇంట్లో ఒకరితో ఒకరికి పొత్తు పొసగదు. సంపాదించని తండ్రి అంటే కొడుకులకు చులకన. తనను లక్ష్యపెట్టని కొడుకులంటే తండ్రికి చిన్నచూపు. ఎవరి లోకం వారిదే అన్నట్టుగా ఉంటుంటారు. ఇలా ఉండగా అనూప్‌కు ఓ పెండ్లి సంబంధం కుదురుతుంది. నిశ్చితార్థం రోజు ఆ అమ్మాయిని ఎవరో ప్రేమిస్తున్నారని తెలిసి.. పెండ్లి రద్దు చేసుకుంటాడు. పెండ్లి తప్పిపోయిందన్న బాధ నుంచి బయటపడటానికి వాళ్ల తాతయ్యను కాశీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. చర్చోపచర్చల తర్వాత కుటుంబమంతా వారణాసికి బయల్దేరుతుంది. ఒకరితో ఒకరికి పొసగని ఆ కుటుంబ సభ్యుల కాశీ ప్రయాణం ఎలా సాగింది? అక్కడేం జరిగింది? ఈ యాత్ర వాళ్ల కుటుంబంలో ఎలాంటి మార్పు తెచ్చిందన్నది మిగిలిన కథ! అక్కడక్కడా నిదానంగా సాగినట్టు అనిపించినా.. మొత్తంగా మంచి సినిమా అనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

