మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక థ్రిల్లర్ ఫాంటసీ ఎంటైర్టెనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకుడు. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆదివారం మొదలైంది.
ఫాహద్ ఫాజిల్ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రకటనను విడుదల చేస్తూ.. ఫాహద్ ఫాజిల్, దర్శకుడు శశాంక్, నిర్మాత ఎస్.ఎస్.కార్తికేయ సెట్లో ఉన్న స్టిల్స్‌ని మేకర్స్ మీడియాకు షేర్ చేశారు. నవంబర్ 8 వరకూ ఈ షెడ్యూల్ ఉంటుందనీ, ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తామని, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ.