F3 Movie On OTT | వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో వచ్చిన ‘ఎఫ్-2’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ మే 27న విడుదలైన ఈ చిత్రం సీక్వెల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా రెట్టింపు ఎంటర్టైనమెంట్తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వెంకీ, వరుణ్‌ల కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అనిల్ రావిపూడి మరోసారి ఆడియెన్స్‌ను రెండున్నర గంటలు హాయిగా నవ్వుకునేలా చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
‘ఎఫ్-3’ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో జూలై 22 నుండి స్ట్రీమింగ్ కానుంది. చిత్రబృందం తెలిపిన ప్రకారమే ఈ చిత్రం విడుదలైన 50రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ మధ్య కాలంలో సినిమాలన్ని దాదాపుగా నెలలోపే ఓటీటీలలో దర్శనమిస్తున్నాయి. కాగా ఈ చిత్రం దాదాపు 8 వారాల తర్వాత డిజిటల్లోకి రావడం విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించగా సునీల్, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
Fun and Frustration #F3 set its premiere date on SonyLiv, July 22nd. pic.twitter.com/K1wg3k0eK9
— LetsOTT Global (@LetsOTT) July 2, 2022