F3 movie | విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ఎఫ్3 . అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 2019 సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా ఎఫ్3 చిత్రం రూపొందింది. తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈచిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రాన్ని మే27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పిల్లలు పరిక్షలు ముగించుకోండి..పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి.. ఫన్ పిక్నిక్కు డేట్ ఫిక్స్ చేశాం అంటూ చిత్ర బృందం ట్విట్టర్లో పోస్టర్‌ను విడుదల చేసింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా, మెహరిన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సునీల్ కీలక పాత్రలో నటించాడు.
పిల్లలు పరీక్షలు ముగించుకోండి🤩
పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి🔥ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం!🔐
No change in date Anymore! 😎
Most Awaited FUN Franchise
➡️ #F3Movie ON MAY 27th🥳#F3OnMay27@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic pic.twitter.com/PTjLnKvQbF— Sri Venkateswara Creations (@SVC_official) February 14, 2022