F3 Collections | నాలుగో రోజూ ‘ఎఫ్3’ ఫన్ రైడ్..లేటెస్ట్ కలెక్షన్లు ఇవే..!
మే 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై..బాక్సాపీస్ వద్ద తన హవా ఏంటో చూపిస్తోంది ఎఫ్3 (F3 ). థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను నవ్వించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడని అంటున్నారు ట్రేడ్ పండితులు.
టాలీవుడ్ (Tollywood) ఫన్ రైడ్ సినిమా ఎఫ్3 (F3 ) మే 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై..బాక్సాపీస్ వద్ద తన హవా ఏంటో చూపిస్తోంది. లాజిక్స్ కు తావు లేకుండా ఎఫ్ 2లాగే మరోసారి మ్యాజిక్ చేసి..థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను నవ్వించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎప్పటికపుడు వస్తున్న కలెక్షన్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
సిల్వర్ స్క్రీన్‌పై హీరోహీరోయిన్లు వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ (Mehreen Kaur), రాజేంద్రప్రసాద్, అలీ సహా మిగిలిన సీనియర్ యాక్టర్లంతా తమ కామెడీతో ఆడియెన్స్ కు వినోదాన్ని అందిస్తున్నారు. ఫస్ట్ వీకెండ్లో తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్లో మంచి కలెక్షన్లు అందుకున్న ఎఫ్ 3..నాలుగో రోజు కూడా తన స్టామినా చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు రూ.4.64 కోట్లు రాబట్టినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. ఏపీ, తెలంగాణలో నాలుగు రోజుల్లో మొత్తం షేర్ రూ.32.11 కోట్లని లేటెస్ట్ టాక్.
ఇక ఎఫ్3ని ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ రిపీటెడ్‌గా థియేటర్లకు వస్తున్నట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్లు (F3 Collections) తాజా కలెక్షన్ల వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణ, ఏపీలో కలెక్షన్లు ప్రాంతాల వారీగా..
నైజాం-రూ.2.03 కోట్లు
యూఏ-రూ.0.66 కోట్లు
గుంటూరు-0.28 కోట్లు
సీడెడ్-రూ.0.71 కోట్లు
నెల్లూరు-రూ.0.14 కోట్లు
ఈస్ట్-రూ.0.34 కోట్లు
వెస్ట్-రూ.0.20 కోట్లు
కృష్ణా-రూ.0.28 కోట్లు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఎఫ్3 చిత్రాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టులో రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిశోర్, అలీ, రఘుబాబు, అన్నపూర్ణమ్మ, సోనాల్ చౌహాన్, ప్రగతి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. పూజాహెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.
Read Also : Anand Mahindra | సర్కారు వారి పాట చూసేందుకు న్యూజెర్సీకి వెళతా..ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Read Also : Shahrukh Khan | మీడియాకు దూరంగా స్టార్ హీరో..కారణమేంటో..?
Read Also : Anudeep KV | ‘జాతిరత్నం’ డైరెక్టర్ అప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడుగా..
Read Also : Trivikram | విలన్ కోసం స్టార్ యాక్టర్ల పేర్లు పరిశీలిస్తోన్న త్రివిక్రమ్..!
Read Also : Vijay Ananya Hook step | విజయ్-అనన్య పాండే హుక్ స్టెప్ అదిరిందంతే..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

