Peddi : టాలీవుడ్లో కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న రెంటల్, పర్సంటేజీ వివాదానికి తెరపడింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘పెద్ది’ (Peddi) చిత్రం విడుదలకు ముందు మొదలైన ఈ గలాటా చివరకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) జోక్యంతో సద్దుమణిగింది. రెంటల్ విధానంలోనే పెద్ది సినిమాను ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు అంగీకరించారు.
రాం చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన పెద్ది సినిమాను రెంటల్ పద్దతిలోనే ప్రదర్శించనున్నారు. అయితే.. టికెట్ ధరలు పెంచితే 75 శాతం ఎగ్జిబిటర్లకు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. చిరంజీవీ జోక్యం చేసుకోవడంతో.. పర్సంటేజీకి పట్టుపట్టిన తెలంగాణ ఎగ్జిబిటరల్స్ సంఘం రెంటల్కు అంగీకరించింది.
The Crossover Athlete theme becomes the driving force of #PEDDI. 🔥 pic.twitter.com/ki9WqCQvEc
— PEDDI (@PeddiMovieOffl) May 27, 2026
ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ కమిటీ నివేదిక ప్రకారం నడుచుకుకోవాలని ఎగ్జిబిటర్స్ సంఘానికి చిరంజీవి సూచించారు. పెద్దికి పట్టు సడలించినా.. జూన్ 30 నుంచి విడుదలయ్యే సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శించాలను ఎగ్జిబిటర్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రేమకావ్యం ‘ఉప్పెన’తో భారీ హిట్కొట్టిన బుచ్చిబాబు దర్శకత్వం వహించిన పెద్ది సినిమా జూన్ 4 వ తేదీన విడుదలవ్వనుంది.