బిచ్చగాడు సినిమాతో ఇండియావైడ్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ యాక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony). రీసెంట్గా బిచ్చగాడు 2తో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ టాలెంటెడ్ నటిస్తోన్న మరో చిత్రం హత్య (Hatya). తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రంలో రితికా సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ ఎవరు నువ్వు సాంగ్ లిరికల్ వీడియో (Evar Nuvvu Lyric Video)ను విడుదల చేశారు మేకర్స్.
గిరీష్ గోపాల కృష్ణన్ కంపోజ్ చేసిన ఈ పాటను భాష్య శ్రీ రాయగా.. ఎంఎస్ కృష్ణ, అంజనా రాజగోపాలన్ పాడారు. హత్య చిత్రానికి బాలాజీ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన హత్య టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూలై 21న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే విజయ్ ఆంటోనీ టీం ప్రకటించింది. హత్యలో విజయ్ డిటెక్టివ్‌గా కనిపించనున్నాడు.
క్రైమ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో నందితా శ్వేత, నంబెస్సాన్ రమ్య, మహిమా నంబియార్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.. ఇన్ఫినిటి ఫిలింస్ వెంచర్స్ నిర్మిస్తోంది.
ఎవరు నువ్వు సాంగ్ లిరికల్ వీడియో
హత్య ట్రైలర్