Suryapet Junction | ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సూర్యపేట్ జంక్షన్’. రాజేష్ నాదెండ్ల దర్శకుడు. అనిల్‌కుమార్ కాట్రగడ్డ, ఎన్.శ్రీనివాసరావు నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో ఈశ్వర్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ నేనే రాశాను. సూర్యపేట పరిసరాల్లో జరిగే కథ ఇది. ప్రభుత్వం నుంచి ఉచితాలు తీసుకోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారో ఈ కథలో చూపించాం. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. దర్శకుడు రాజేష్ అద్భుతంగా తెరకెక్కించారు.’ అని చెప్పారు.
మంచి కథకు, సమర్ధవంతమైన టీమ్ తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా రుజువు చేయనున్నదని, నటీనటుల పరంగానే కాదు, సాంకేతికంగా కూడా ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో భాగమైనందుకు హీరోయిన్ నైనా ఆనందం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్‌ప్రసాద్, సంగీతం: రోషన్ సాలూరి, గౌర హరి, నిర్మాణం: యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్.