Emraan Hashmi | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించిన తాజా చిత్రం ‘ఆవారాపన్ 2’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల మైలురాయిని దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో దిశా పటాని కథానాయికగా నటించగా, శబానా అజ్మీ, శ్రియా శరన్ కీలక పాత్రల్లో కనిపించారు.
బుధవారం రోజున సినిమా కలెక్షన్లలో స్వల్పంగా 30 శాతం తగ్గుదల కనిపించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద చిత్రం పట్టు సడలించలేదు. దేశీయంగా రూ.6.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించడంతో, భారతదేశంలో దీని మొత్తం నెట్ కలెక్షన్స్ రూ.107.50 కోట్లకు చేరాయి. ఇండియా గ్రాస్ వసూళ్లు రూ.128.29 కోట్లుగా ఉండగా, ఓవర్సీస్ మార్కెట్లో రూ.25.30 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్స్ రూ.153.59 కోట్లకు చేరుకున్నాయి. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే రూ.200 కోట్లు దాటడం కూడా కష్టం కాదు అనిపిస్తుంది. మరోవైపు ఇమ్రాన్ హష్మీ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘ఆవారాపన్ 2’ నిలిచింది.