అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’. స్మరన్ రెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 18న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమా నుంచి ‘ప్రాణం కన్నా ప్రేమించినా..’ అంటూ సాగే గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. కైలాష్ఖేర్ ఆలపించిన ఈ పాటను కృష్ణకాంత్ రచించారు. హార్ట్బ్రేకింగ్ ఎమోషనల్ సాంగ్ ఇదని, ప్రేమికుల మదిలోని బాధను వ్యక్తం చేస్తూ సాగుతుందని దర్శకుడు తెలిపారు. యథార్థ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్ని సంగీతాన్నందించారు.