Eleven Movie OTT | రోటీన్ సినిమాలకు భిన్నంగా నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులతో నవీన్ చంద్ర ఒకడు. అయితే ఆయన ప్రధాన పాత్రల్లో నటించి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎలెవన్. ఈ చిత్రానికి లోకేశ్ అజిల్స్ దర్శకత్వం వహించగా.. ఎ.ఆర్.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. రియా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, ఆడుకాలం నరేన్, రవి వర్మ, కిరీటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. గత నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ చిత్రం జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విశాఖపట్నంలో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తాయి. బాధితులను గుర్తించలేని స్థితిలో పోలీసులు తలలు పట్టుకుంటారు. ఈ కేసును డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ శశాంక్‌కు ప్రమాదం జరగడంతో, ఏసీపీ అరవింద్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. అరవింద్ రంగంలోకి దిగిన కూడా హత్యలు ఆగవు. హంతకుడితో పాటు హత్యకు గురైన వారి ఆనవాళ్లు కూడా దొరకవు. సవాలుగా మారిన ఈ కేసులో చివరకు ఓ చిన్న ఆధారం లభిస్తుంది. అయితే ఈ క్లూతో నేరస్థుడిని అరవింద్ ఎలా పట్టుకున్నాడు. నేరస్థుడికి ఎవరు సహాయం చేశారు? అసలు ఆ సైకో ఎందుకు హత్యలు చేస్తున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.