Ee Nagaraniki Emaindi Movie | రీ-రిలీజ్‌ల ట్రెండ్ నెమ్మదిగా తగ్గుతుంది.. వాటిపై క్రేజ్ కూడా పడిపోయింది అనుకుంటున్న టైమ్‌లో ఏదో ఒక సినిమా వచ్చి మళ్లీ ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ఆ మధ్య ఆరెంజ్ సినిమా టైమ్‌లో అంతే. అంతకు ముందు రీ-రిలీజైన రెండు, మూడు సినిమాలు కనీసం థియేటర్ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయాయి. దాంతో కొన్ని రోజులుగా రీ-రిలీజ్‌ల ఊసే కనిపించలేదు. కొంచెం గ్యాప్ తర్వాత ఆరెంజ్ రీ-రిలీజై ఊహించని స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. దాంతో మళ్లీ రీ-రిలీజ్ ట్రెండ్ షురూవైంది. అయితే ఆరెంజ్ తర్వాత రీ-రిలీజైన ఏ సినిమా కూడా ఆ స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయాయి.
అయితే ఇప్పుడు మళ్లీ ఈ నగరానికి ఏమైంది సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది. ఐదేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా భారీ విజయం సాధించకపోయినా.. యూత్‌ను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 29న ఈ సినిమాను పెద్ద ఎత్తున రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పెట్టినవి పెట్టినట్లు షోలు ఫుల్ అయిపోతున్నాయి. ఒక రీ-రిలీజ్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ఆశా మాశీ కాదు. అది కూడా ఒక స్టార్ కాస్ట్ లేని సినిమా. ట్రేడ్ సైతం ఈ సినిమా బుకింగ్స్ చూసి ఆశ్చర్యపోతుంది. ఇక ఈ సినిమా బుకింగ్స్ చూసి తరుణ్ భాస్కర్ అయితే ఎగిరి గంతేస్తున్నాడు.
నిజానికి సురేష్ ప్రొడక్షన్స్ ముందుగా ఈ సినిమాకు పరిమిత విడుదల ఇవ్వాలనే ఉద్దేశంతో తక్కువ థియేటర్లను మాట్లాడుకుంది. తీరా చూస్తే డిమాండ్‌కు తగ్గట్టు ఇప్పుడా కౌంట్ పెంచక తప్పేలా లేదు. ఇక దీని జోరు బాగానే ఉంది కానీ.. అదే రోజు విడుదలవుతున్న స్పై సినిమాకు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు. మాములుగా నిఖిల్ సినిమాలకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలను ఖచ్చితంగా చూడాలనే వాళ్లు బోలెడున్నారు. అయితే ఈ నగరానికి ఏమైంది సినిమా వళ్ల స్పై సినిమా పేరే వినిపించడం లేదు. దానికి తగ్గట్లు మేకర్స్ కూడా ఆహా ఓహో అనిపించే రేంజ్లో ప్రమోషన్లు గట్రా కూడా చేయడం లేదు.
ఎంత పాన్ ఇండియా సినిమా అయినా.. ప్రమెషన్లు తేలిపోతే ఓపెనింగ్స్ విషయంలో దెబ్బ పడుతుంది. దానికి తోడు టీజర్, ట్రైలర్లు సైతం జనాలలో పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. ఎంత మౌత్ టాక్ పాజిటీవ్‌గా వచ్చినా సరే.. ఒక సినిమాకు ఓపెనింగ్స్ కీలకం. ఈ విషయంలో మాత్రం స్పై దెబ్బతిన్నట్లే అనిపిస్తుంది. దానికి తోడు రిలీజ్ డేట్‌ను కేవలం రెండు వారాల ముందే కన్ఫార్మ్ చేయడం. ప్రమోషన్లకు పెద్దగా టైమ్ లేకపోవడం కూడా దీనిక మైనసే. అయితే ఈ సినిమాకు పెద్దగా బిజినెస్ జరగలేదు. దాదాపు 20కోట్ల రేంజ్లో షేర్ సాధిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. మౌత్ టాక్ పాజిటీవ్‌గా వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమి కాదు.