లండన్: బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఆదివారం ప్రకటించారు. ద పవర్ ఆఫ్ ద డాగ్ సినిమాకు ఈ యేటి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. విల్ స్మిత్‌కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ద పవర్ ఆఫ్ ద డాగ్ సినిమాను తీసిన జేన్ చాంపియన్‌కు బెస్ట్ డైరక్టర్ అవార్డు దక్కింది. 75 ఏళ్ల బ్రిటీష్ అకాడమీ చరిత్రలో ఓ మహిళా డైరక్టర్ ఈ అవార్డును గెలవడం ఇది మూడవసారి. నటనలో విల్ స్మిత్, జొన్నా స్కాన్లాన్లకు అవార్డులు దక్కాయి. కరోనా వల్ల గత ఏడాది బాఫ్టా అవార్డులను ఆన్లైన్లో ప్రజెంట్ చేశారు. అయితే ఈసారి వేడుకను సాదాసీదాగా నిర్వహించారు. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో బాఫ్టా అవార్డు సెర్మనీ జరిగింది. ఈ ఏడాది బాఫ్టాలో అత్యధికంగా డ్యూన్ చిత్రానికి అవార్డులు వరించాయి. సైన్స్ ఫిక్షన్ డ్యూన్ మొత్తం 11 కేటగిరీల్లో పోటీపడింది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, సౌండ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విభాగాల్లో డ్యూన్ చిత్రానికి బాఫ్టా అవార్డులు దక్కాయి.