Sita Ramam Trailer Date | మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ఓకే బంగారం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దుల్కర్ ‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ చిత్రం తర్వాత ఈయన నటించిన ప్రతి సినిమా డబ్బింగ్ రూపంలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్ టీజర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు.
తాజాగా చిత్రబృందం సీతారామం ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించింది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు దుల్కర్ పోస్టర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్లో ఉదయం 9.30 గంటల నుండి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగునుంది. రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించనున్నాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించనుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తుంది.
Join us at the Trailer Launch Event of #SitaRamam at @PrasadsCinemas, Tomorrow 9:30 AM 💞#SitaRamamTrailer@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh@Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth pic.twitter.com/WSh7KZgyG7
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2022