పాతరోజుల్ని గుర్తుకు తెచ్చింది!
“సీతా రామం’ సినిమా చూసి చాలా జెలసీ ఫీలయ్యాను. నాకు రావాల్సిన పాత్రను దుల్కర్ కొట్టేశాడనిపించింది (నవ్వుతూ). ఈ సినిమా చూస్తుంటే నేను నటించిన గీతాంజలి, సంతోషం, మన్మథుడు సినిమాల నాటి పాత రోజులు గుర్తుకొచ్చాయి’ అన్నారు అగ్ర నటుడు నాగార్జున. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సీతా రామం’ థాంక్స్మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాగార్జున మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని దర్శకుడు హను రాఘవపూడి ఓ దృశ్యకావ్యంలా తెరకెక్కించాడు. కథానాయిక మృణాల్ అందం, అభినయం చూసి ఆ పాత్ర ప్రేమలో పడిపోయా. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనం. గత వారం విడుదలైన బింబిసార, సీతా రామం చిత్రాల్ని గొప్పగా ఆదరిస్తున్నారు. మంచి కంటెంట్‌తో సినిమాలు తీస్తే థియేటర్లకు వస్తామనే నమ్మకాన్ని ఇచ్చారు’ అని అన్నారు. రామ్ పాత్ర తన కెరీర్లోనే ప్రత్యేకమని దుల్కర్ సల్మాన్ ఆనందం వ్యక్తం చేశాడు. అశ్వనీదత్ మాట్లాడుతూ ‘నాగార్జున మా బ్యానర్లో ఐదు చిత్రాలు చేశాడు. ‘సీతా రామం’ చిత్రానికి అద్భుత విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

