Kaantha | డేట్ ఫిక్స్ చేసుకున్న దుల్కర్ సల్మాన్.. సోలోగా వస్తోన్న కాంత
Kaantha | పీరియడ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కాంత సినిమాపై ఇప్పుడు అందరి ఫోకస్ ఉండగా. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్, టీజర్లకు మంచి స్పందన వస్తోంది.
Kaantha | లక్కీ భాస్కర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఓ వైపు యాక్టర్‌గా మరోవైపు నిర్మాతగా కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్నాడు దుల్కర్ సల్మాన్. ఇక ఈ ఏడాది దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన లోక చాప్టర్ 1 చంద్ర బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పీరియడ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కాంత సినిమాపై ఇప్పుడు అందరి ఫోకస్ ఉండగా. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్, టీజర్లకు మంచి స్పందన వస్తోంది.
ఈ మూవీ ఇప్పటికే సెప్టెంబర్ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లోక చాప్టర్ కేరళ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతుండటంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్‌గా కాంత సినిమా రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేశారు. ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. దీపావళి సందర్భంగా మేకర్స్ లీడ్ రోల్స్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను లాంచ్ చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
దుల్కర్ సల్మాన్‌తో భాగ్యశ్రీ బోర్సే రొమాన్స్ చేయనుంది. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు. నవంబర్ 14న ఏ సినిమాలు లేకపోవడం, సోలో రిలీజ్‌కు ప్లాన్ చేసుకోవడంతో ఎలాంటి పోటీ ఉండదు. మరి మంచి టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమైనట్టే.
Diwali just got a whole lot more explosive!💥#Kaantha will be lighting up theatres worldwide from NOVEMBER 14th!⚡
Wishing you all a happy Diwali and we’ll see you in the theatres very soon.✨❤
A @SpiritMediaIN and @DQsWayfarerFilm production 🎬#Kaantha #DulquerSalmaan… pic.twitter.com/dJqhbA5uev
— Rana Daggubati (@RanaDaggubati) October 20, 2025
Read Also :
Agent Ching Attacks | రూ.150 కోట్ల యాడ్‌లో రణ్వీర్ సింగ్, శ్రీలీల.. ‘ఏజెంట్ చింగ్ అటాక్’ ట్రైలర్ విడుదల
ఎవరైనా అవార్డు ఇస్తే చెత్తకుండిలో పడేస్తా.. హాట్ టాపిక్‌గా విశాల్ కామెంట్స్
Black Gold | ఇంట్రెస్టింగ్గా బ్లాక్ గోల్డ్ టైటిల్ లుక్.. హైప్ పెంచుతోన్న సంయుక్తా మీనన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

