‘నా గత చిత్రాలు లవ్‌టుడే, డ్రాగన్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ఇప్పుడు ‘డ్యూడ్’ సినిమాకు అంతకుమించిన స్పందన లభిస్తున్నది. ‘డ్రాగన్’ కంటే ఈ సినిమానే తొలి రోజు ఎక్కువ వసూళ్లు చేసిందని నిర్మాతలు చెప్పడం ఆనందంగా ఉంది’ అన్నారు ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘డ్యూడ్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం డ్యూడ్ దివాళి బ్లాస్ట్ పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మాట్లాడుతూ.. దీపావళికి బిగ్ విన్నర్ ఇదని, తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 22 కోట్లు వసూలు చేసి తమ అంచనాలను నిజం చేసిందన్నారు.
‘జెన్ జీ కాన్సెప్ట్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలబోసి దర్శకుడు అద్భుతమైన కథ రాసుకున్నాడు. ప్రతీ సీన్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. హీరో ప్రదీప్ రంగనాథన్ క్యారక్టరైజేషన్ అందరికి కనెక్ట్ అవుతున్నది తెలుగు రాష్ర్టాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని రాష్ర్టాల్లో సినిమా సూపర్‌హిట్’ అని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు లాంగ్న్ ఉండబోతున్నదని, రాబోవు రోజుల్లో వసూళ్లు మరింతగా పెరుగుతాయని మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.