క్రేజీ యువజంట ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటిస్తున్న పాన్ ఇండియా యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ ‘డ్యూడ్’. శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు మేకర్స్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ‘బూమ్ బూమ్’ అంటూ సాగే ఈ పాట ఎనౌన్స్మెంట్ పోస్టర్లో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ట్రెండీ, ైస్టెలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: సాయి అభ్యంకర్.