Drishyam 4 | ‘దృశ్యం 4’ వచ్చేస్తోంది.. మరోసారి మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ మ్యాజిక్!
Drishyam 4 | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
Drishyam 4 | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించగా, తాజాగా ఈ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా ‘దృశ్యం 4’ (Drishyam 4) తెరకెక్కనున్నట్లు చిత్ర ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ అధికారికంగా ప్రకటించారు. మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్ మరోసారి తన అత్యంత శక్తివంతమైన, ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసిన ‘జార్జ్‌కుట్టి’ పాత్రలో కనిపించనున్నారు.
ఇటీవల విడుదలైన ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను సరికొత్త ఉత్కంఠలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో కేరళలో జరిగిన ఓ ప్రతిష్టాత్మక అవార్డు వేడుకలో పాల్గొన్న నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ మాట్లాడుతూ.. ‘దృశ్యం 4’ చిత్రాన్ని కచ్చితంగా నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సిరీస్‌ను అద్భుతమైన మలుపులతో నడిపించిన మాస్టర్ మైండ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనుండటంతో అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి.
మొదటి భాగం నుంచి ప్రతి సీక్వెల్లోనూ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం జార్జ్‌కుట్టి పోలీసులను, చట్టాన్ని ఏ విధంగా బురిడీ కొట్టించాడనే కథాంశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచాయి. ఇప్పుడు నాలుగో భాగం ప్రకటన రావడంతో.. జార్జ్‌కుట్టి ఈసారి ఏ స్థాయి సవాళ్లను ఎదుర్కోబోతున్నాడు, ఎలాంటి మైండ్-బ్లోయింగ్ ట్విస్టులతో కథను నడిపించనున్నాడనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటులు మరియు షూటింగ్ షెడ్యూల్ అధికారికంగా వెల్లడి కానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

