Double ISMART | లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఫుల్ ఎనర్జీతో ఎలాగైనా మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni)తో డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గురించి ఏదో ఒక ఫొటో రిలీజ్ చేస్తూ అప్డేట్ ఇస్తుంది పూరీ అండ్ ఛార్మీ టీం. తాజాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్, రామ్, ఇతర టీం మెంబర్స్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. సరదా సాయంత్రం అని క్యాప్షన్ పెట్టాడు రామ్.
మున్నాభాయ్‌తో పూరీ, రామ్, ఛార్మీ ఫన్ టైం స్టిల్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షురూ అయినట్టు తెలియజేస్తూ.. రామ్‌పై ఉస్తాద్ స్టైల్లో వ్యాన్‌లో వచ్చే సీన్ స్టిల్ షేర్ చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆ తర్వాత ఛార్మీ కౌర్ (Charmme Kaur) హీరో రామ్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేసుకుంటూ.. మొదటి యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడిక మరో క్రేజీ షూట్ కోసం ఇండియా దాటే సమయం వచ్చేసింది.. అని ట్వీట్ చేసింది. ఈ లెక్కన పూరీ టీం ప్రస్తుతం విదేశాల్లో ఏమైనా ఉందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2024 మార్చి 8న విడుదల చేయనున్నారు. పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ను మించి డబుల్ ఎంటర్టైన్ మెంట్ సీక్వెల్లో అందించబోతున్నటు టైటిల్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు. రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రామ్, సంజూ భాయ్‌తో పూరీ జగన్నాథ్..
What a fun evening..#DoubleISMART pic.twitter.com/KXPE43UmdO
— RAm POthineni (@ramsayz) August 13, 2023
రామ్‌తో ఛార్మీ కౌర్ సెల్ఫీ..
Successfully completed our 1st action-packed schedule and now time to fly out of India for our yet another maaddd crazy shoot 😀#DoubleISMART
IN CINEMAS MARCH 8th, 2024💥Ustaad @ramsayz #PuriJagannadh@duttsanjay @IamVishuReddy @PuriConnects pic.twitter.com/CVlAff4TiK
— Charmme Kaur (@Charmmeofficial) July 31, 2023
The much-anticipated shoot of #DoubleISMART began today on a huge set with a MASSive action sequence under action choreography of Kecha & DOP Gianni💥
IN CINEMAS MARCH 8th,2024❤️🔥
Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/ZT66YiHtIF
— Puri Connects (@PuriConnects) July 12, 2023
లాంఛింగ్ ఈవెంట్ ఫొటోలు..
Here are a few more clicks from the #DoubleISMART Launch Ceremony graced by near & dear ones in Hyderabad❤️
Regular Shoot Begins on July 12th 🔥
In cinemas on MARCH 8th, 2024💥Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/oJOA1FoYG4
— Puri Connects (@PuriConnects) July 10, 2023