Double Ismart Movie | రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్‌ను మెప్పించడంతో ఈ సీక్వెల్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. ఇంటెన్స్ యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చిత్రాన్ని తీర్చిదిద్దామని, ఓల్డ్‌సిటీ శంకర్‌గా హీరో రామ్ యాక్షన్ మరో స్థాయిలో ఉంటుందని, ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు ైక్లెమాక్స్ ఘట్టాలు ఎవరూ ఊహించని రీతిలో సాగుతాయని మేకర్స్ తెలిపారు. రామ్, కావ్యథాపర్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుందని, మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయని చిత్ర బృందం పేర్కొంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నది. పూరి జగన్నాథ్, ఛార్మికౌర్ నిర్మించారు.