Elimination | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదో వారం ఎలిమినేషన్‌పై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఈ వారం నామినేషన్ నుంచి తనూజ సురక్షితంగా బయటపడింది. శుక్రవారం ఎపిసోడ్లో జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో ఆమె ఇమ్యూనిటీ గెలుచుకొని కొత్త కెప్టెన్‌గా ఎంపిక అయ్యింది. దీంతో ఆమె, అలాగే ఇమ్మాన్యుయెల్ మినహా హౌజ్‌లోని మిగిలిన వారంతా నామినేషన్లో ఉన్నారు. నామినేషన్లో కళ్యాణ్, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, భరణి, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, సంజనా, రీతూ చౌదరి, దివ్య ఉండగా ఇందులో ఎవరు హౌజ్‌ను వీడబోతున్నారన్నది బిగ్ బాస్ అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేపింది.
సోషల్ మీడియాలో వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ వారం బాటమ్ 3లో నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, దివ్య ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని ముందుగానే ఊహించారు. తాజా అప్డేట్ ప్రకారం, షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని, హౌజ్‌ని విడిచేది నిఖిల్ నాయర్ అని వార్తలు వస్తున్నాయి. కొంతమంది అభిమానులు దివ్య ఎలిమినేట్ అవుతుందని భావించినా, ఆమె హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడంతో బిగ్ బాస్ టీమ్ ఆమెను సేవ్ చేసి, నిఖిల్‌ను పంపినట్లు సమాచారం. కంటెంట్ ఇవ్వడంలో నిఖిల్ ఫెయిల్ కావడంతో పాటు ఓటింగ్ పరంగా కూడా నిఖిల్, గౌరవ్ ఇద్దరూ చాలా లీస్ట్‌లో ఉన్నారు.
టాస్కుల్లో ఇంపాక్ట్ చూపలేకపోవడం, తెలుగులో బాగా మాట్లాడలేకపోవడం, హౌజ్‌లో సైలెంట్‌గా ఉండటం, ఎంటర్టైన్ చేయకపోవడం ఇవన్నీ నిఖిల్ ఎలిమినేషన్‌కు కారణాలుగా మారాయి. నాగార్జున కూడా వార్నింగ్ ఇచ్చినప్పటికీ, నిఖిల్ ఎలాంటి మార్పు చూపించలేదని అంటున్నారు. ప్రస్తుతం హౌజ్‌లో 11 మంది ఉన్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే 10 మంది మిగులుతారు. కానీ షోకు కేవలం నాలుగు వారాలే మిగిలి ఉండగా, టాప్ 5కి చేరడానికి త్వరలోనే మరిన్ని ఎలిమినేషన్స్ జరగాల్సి ఉంటుంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం రెండవ ఎలిమినేట్ అయ్యేది గౌరవ్ గుప్తా కావచ్చని టాక్. ఇప్పటికైతే ఇది అనధికారిక సమాచారం మాత్రమే. అధికారిక ప్రకటనా అయితే వీక్ ఎండ్ ఎపిసోడ్లో వెల్లడవుతుంది.